తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ రైస్ లో మరో కొత్త పేరు వచ్చి చేరింది. నిన్న మొన్నటి వరకు సినిమా దర్శకులు, నిర్మాతలు పోటీపడుతున్నారనేది తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక టీవీ ఛానల్ అధినేతకు చంద్రబాబు నాయుడు చైర్మన్ పదవిని ఖరారు చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇది అధికారికంగా కాదు. ప్రచారం అయితే బాగా జరిగింది. దీనిపై టిడిపి నాయకులు ఎవరూ కూడా స్పందించలేదు. ఇక ఇంకేముంది అయిపోయింది మరికొద్ది రోజుల్లో నామినేటెడ్ టీటీడీ బోర్డును నిర్మించేస్తున్నారని అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ బోర్డు విషయంలో చంద్రబాబు నిర్ణయం మారినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వి రమణ పేరు ఇప్పుడు టిటిడి చైర్మన్ రేస్ లో ముందంజలో ఉందని అంటున్నారు. ప్రస్తుతం అనధికారికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవిని తనకు ఇవ్వాలని ఇటీవల అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ ముఖ్యమంత్రిని కోరారని దీనికైనా ప్రాథమికంగా అంగీకారం తెలిపారని అంటున్నారు. దీనిపై అనేక కోణాల్లో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.