జోగి రమేష్ నాలుగు సార్లు పోటీ చేసి మూడు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగారు. అందులో పెడన నుంచి రెండుసార్లు, మైలవరం నుంచి ఒకసారి, పెనమలూరు నుంచి మరోసారి పోటీ చేశారు. జోగి సొంత నియోజకవర్గం మైలవరం. కానీ అక్కడ నుంచి 2014లో పోటీ చేసి ఓడి పోయిన ఆయన 2019లో పెడన వెళ్లారు. అక్కడ గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇదే సమయంలో ఇక్కడ నుంచి వైసీపీ తరపున వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి గెలిచారు. ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వసంత, జోగిలు చెరో నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే మైలవరంలో తనను పని చేయనీయకుండా జోగి ఆయన వర్గం ఇబ్బంది పెడుతోందని వసంత పార్టీకి రాజీనామా చేశారు.
గత ఎన్నికల్లో టీడీపీలో చేరి మళ్ళీ మైలవరం నుంచి గెలిచారు. అప్పట్లో కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు వైసీపీ అధిష్టానం కూడా జోగిని మైలవరం నియోజకవర్గం ఇన్చార్జిగా నియమించటం అక్కడ నుంచి పోటీకి సై అని క్లారిటీ ఇవ్వటంతో పాత శత్రువుల మధ్య పోరు మళ్ళీ మొదలైనట్టైంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వసంత, జోగి ప్రత్యర్థులుగా మారనున్నారు. ఇప్పటికే పలుమార్లు జోగి తీరును వసంత కృష్ణప్రసాద్ ఎండకట్టారు. తాజా సమావేశంలో వసంత టార్గెట్ గా జోగి మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య పోరు మొదలైందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోందట. గతంలో వసంత గెలుపుకు సహకరించిన జోగి ఆ తర్వాత శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు రెండు వేర్వేలు పార్టీల్లో ఉన్నారు. రానున్న రోజుల్లో వసంత వర్సెస్ జోగి వ్యవహారం ఎలాంటి రాజకీయ రచ్చ రేపుతాయో చూడాలి మరి.