ఉల్లిపాయ పొట్టుతో ఉపయోగాలు.. 

onion-27.jpg

ఉల్లిపాయలు ఉపయోగించని ఇల్లు ఉంటుందా? ప్రతి రోజూ కనీసం ఒక్క ఉల్లిపాయ అయినా కోయందే రోజు గడవదు. ఉల్లిపాయల మాదిరిగానే ఉల్లిపాయ తొక్కలు కూడా ఆల్ రౌండర్ అని మీకు తెలుసా. ఉల్లిపాయ తొక్కలను ఇంటి శుభ్రపరచడం నుండి అందం, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటి కోసం ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ తొక్కల సహాయంతో మొక్కలకు ఎరువులాగా ఉపయోగపడే స్ప్రే తయారు చేయవచ్చు. ఉల్లి తొక్కలతో తయారు చేసిన ఈ స్ప్రే మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది. స్ప్రే తయారు చేయడానికి, ముందుగా ఉల్లి తొక్కలను నీటిలో మరిగించండి.

ముఖ సౌందర్యానికి:

ఉల్లిపాయ తొక్కల్లో విటమిన్ ఎ, ఇ, సి పుష్కలంగా లభిస్తాయి. వీటితో అనేక చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖంపై మరకలు తగ్గాలంటే ఈ తొక్కలను నీటిలో రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వడగట్టిన నీటిలో చిటికెడు పసుపు, కొద్దిగా శనగపిండి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను వారానికి కనీసం రెండుసార్లు ఫేస్ మాస్క్ లా ముఖానికి రాసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.

జుట్టు సమస్యలు:

జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య ఉంటే వాటిని ఉల్లి తొక్క సహాయంతో తగ్గించుకోవచ్చు. చుండ్రు సమస్య ఉంటే ఉల్లిపాయ తొక్కలను నీటిలో మరిగించి తర్వాత వడకట్టాలి. నీరు చల్లారిన తర్వాత, ఈ నీటితో తలకు మసాజ్ చేసుకుని జుట్టును కడగాలి. ఇది చుండ్రు తగ్గిస్తుంది. 

క్లీనర్ తయారీ:

ఉల్లిపాయ తొక్కల సహాయంతో ఆల్ ఇన్ వన్ క్లీనింగ్ లిక్విడ్ ను తయారు చేయవచ్చు. ఈ శుభ్రపరిచే ద్రవంతో ఫ్లూరింగ్, గాజు వస్తువులు, ఇతర మెటల్ వస్తువుల్ని కూడా సులభంగా శుభ్రం చేయవచ్చు. క్లీనింగ్ లిక్విడ్ తయారు చేయడానికి ముందుగా ఉల్లిపాయ తొక్కలను నీటిలో మరిగించి, వాటిని గ్రైండర్లో గ్రైండ్ చేసి, మెత్తని పేస్ట్ తయారు చేయండి.

Share this post

scroll to top