భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది..

ys-jj-07.jpg

పాకిస్తాన్‌పై భారత్‌ దాడులు ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. భారత్‌లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం అని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం అని ట్వీట్ చేశారు.

ఆపరేషన్‌ సిందూర్‌పై వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. భారత్‌లో రక్తపాతం సృష్టిస్తున్న ఉగ్రవాదుల, వారి శిబిరాలు, స్థావరాలపై చర్యలు అనివార్యం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. కశ్మీర్‌లోని పహల్గావ్‌లో ఉన్న బైసరన్‌ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్‌ సిందూర్‌ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్‌ దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు.

Share this post

scroll to top