జువైనల్ హోమ్ లో ఉండే బాలికపై అత్యాచారం..

thirupathi-24.jpg

ఆడ పిల్లలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికూనలు, బాలికలు, యువతులు. మహిళలు, వృద్ధురాలు ఇలా తేడా లేకుండా కామాంధులు వారి పశువాంఛను తీర్చుకుంటున్నారు. తాజాగా, తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ బాలికల పరిశీలన గృహం లో ఉండే బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుపతి నగరంలో అనాథ బాలికలతో పాటు నేర చరిత్ర ఉన్న బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఉంది. ఈ వసతి గృహంలో ఉండే బాలికలు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గృహంలో ఉంటూ స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది.

Share this post

scroll to top