ఇరు రాష్ట్రాల ప్రజల సఖ్యతే ప్రగతిలో ముందుకు నడిపిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు..

pavan-kalyan-7.jpg

హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే సమస్య తన దృష్టికి వచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయి. మళ్లీ కార్యకలాపాలు మొదలు కానున్నాయని, ఇక్కడ కూడా తగిన అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఉమ్మడి రాజధాని గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదని తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజల సఖ్యతే మనల్ని ప్రగతిలో ముందుకు నడిపిస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు మెరుగైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయని చెప్పారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు వివిధ రకాల రంగాల్లో ఉపాధి మెరుగవుతుందని తెలిపారు. అక్కడి ప్రాంతం, ప్రజలు అభివృద్ధి బాటలో నడుస్తారని చెప్పారు.

Share this post

scroll to top