గుండెల నిండా కమిట్‌మెంట్‌తో పనిచేస్తాను అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మైసూర్‌వారి పల్లిలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు. పంచాయతీలు దేశ అభివృద్ధికి చాలా కీలకం. రాష్ట్రంలో 70 శాతం వైసీపీకి సంబంధించిన సర్పంచ్ లే అయినా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. స్వర్ణ గ్రామాల అభివృద్ధి నా లక్ష్యం అని స్పష్టం చేశారు. అయితే, సినిమాలను రాజకీయాలను నేను చాలా ప్రత్యేకంగా చూస్తాను అన్నారు. ఇక, అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయి. గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. గ్రామాల అభివృద్ధికి గ్రామసభలు చాలా కీలకం అన్నారు పవన్ కల్యాణ్. గత ప్రభుత్వం 51 వేల కోట్లు ఖర్చు పెట్టమన్నారు. కోస్తా కంటే కూడా ఎక్కువ గనులు ఉన్న ప్రాంతం రాయలసీమ గుండెల నిండా కమిట్‌మెంట్‌తో పని చేస్తా.
గుండెల నిండా కమిట్‌మెంట్‌తో పనిచేస్తా..
