మంత్రి బాధ్యతలను చేబట్టబోతున్న పవన్ కు ప్రముఖ రచయిత కోన వెంకట్ శుభాకాంక్షలు.

pavan-19.jpg

గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ విజయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలకపోత్ర పోషించారు. ఈ సందర్భంగా నేడు ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ రచయిత కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోన వెంకట్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పవన్ కళ్యాణ్, చిరంజీవిని ఉద్దేశిస్తూ ఆయన అభినందలు తెలుపుతూ రాసుకొచ్చారు. కోన వెంకట్ చేసిన పోస్టులో.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మన ప్రియమైన పవన్ కళ్యాణ్ కు ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. ఇది ఆయన కల కాదు, ఆయన లక్షలాది మంది అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సామాన్యులు అలాగే ఆయన కుటుంబ సభ్యుల కల. ఈ స్థానానికి చేరుకోవడానికి ఆయన 15 సంవత్సరాలు కష్టపడ్డారు. కొన్ని సంవత్సరాల క్రితం కష్టమైన ప్రయాణాన్ని ప్రారంభించి, తన సోదరుడు దానిని విజయవంతంగా పూర్తి చేసిన గర్వించదగిన సోదరుడు పద్మ విభూషణ్ చిరంజీవికి ఈ ప్రత్యేక సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ తెలిపారు.

Share this post

scroll to top