ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకోనున్నారు. కొండగట్టు అంజన్నకు పవన్ కల్యాణ్ మొక్కులు తీర్చుకోనున్నారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పూజలు చేసిన పవన్ కల్యాణ్ ముడుపులు కట్టారు. ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి కొండగట్టు అంజన్న దేవాలయానికి రానున్నారు. పూజల అనంతరం కొండగట్టు నుంచి ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాక సందర్భంగా కొండగట్టులో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా.. కొండగట్టు పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ హైదరాబాద్ నివాసం నుంచి బయలుదేరారు.. రోడ్డు మార్గాన కొండగట్టు వెళ్లనున్న పవన్‌కల్యాణ్.. అక్కడికి చేరుకుని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
కాసేపట్లో కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
