పవన్ కళ్యాణ్‌కు మోడీ స్పెషల్ గిప్ట్.. 

pavankalyan-02.jpg

అమరావతి రైతులకు అండగా ఉంటామని ఐదేళ్ల క్రితం మాట ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇచ్చిన ప్రతీ మాటకు కట్టబడి మళ్లీ ప్రధాని మోడీతో పనులు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. అమరావతి రైతుల త్యాగాలు మర్చిపోలేనివని అన్నారు. వైసీపీ హయాంలో రాజధాని తరలిపోతుందనే భయం అందరిలోనూ కలిగిందని వెల్లడించారు. గత ప్రభుత్వ తెలివిలేని చేష్టల వల్ల రైతులు, విద్యార్థులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడ్డారని అన్నారు. కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగి 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని మోడీ మనకు సమయం ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం. తప్పకుండా పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం చెప్పబోతున్నామని అన్నారు. అమరావతి పున:ప్రారంభోత్సవ సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తుండగా ప్రధాని మోడీ పిలిచారు. వెంటనే మోడీ వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. అప్పుడు పీఎం మోడీ పవన్ కళ్యాణ్‌కు చాక్లెట్ ఇచ్చారు. ఇది చూసి సీఎం చంద్రబాబు నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Share this post

scroll to top