కాషాయ పాలకులు యువత జీవితాలను నాశనం చేశారు..

kargay-9.jpg

కాషాయ పాలకులు యువత జీవితాలను నాశనం చేశారని కాంగ్రెస్ నేత పవన్‌ ఖేరా అన్నారు. నిరుద్యోగం పెచ్చుమీరుతున్నా బీజేపీ నేతలు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పదేండ్లలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. ఢిల్లీలో పవన్‌ ఖేరా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బీజేపీ తీరును తప్పుపట్టారు. గణాంకాలు స్పష్టంగా దేశ ప్రజల ముందున్నాయని, మీరు వీటిని చూడలేదా అని కాషాయ పాలకులను పవన్‌ ఖేరా ప్రశ్నించారు. ఈ గణాంకాలతో మీకెందుకు ఉలుకని నిలదీశారు. నిరుద్యోగ తీవ్రత గురించి డేటా ఆధారంగా రాహుల్‌ మాట్లాడటంలో తప్పేముందని అన్నారు.

Share this post

scroll to top