మత రాజకీయాలకు జన్మస్థలం బీజేపీ..

sharmala-11.jpg

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆమె అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ప్రధాని మోడీ తీరు ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేది, కుల,మతాల మధ్య చిచ్చు పెట్టేది, విభజన రాజకీయాలు చేసేది బీజేపీనే అని విమర్శలు గుప్పించారు. కుట్ర రాజకీయాలకు కేరాఫ్ బీజేపీ అంటూ ఫైర్ అయ్యారు. మత రాజకీయాలకు జన్మస్థలం బీజేపీ అని అన్నారు. మతాన్ని కవచంలా అడ్డుపెట్టుకుని దర్జాగా దేశాన్ని దోచుకుంటోందంటూ విమర్శలు గుప్పించారు షర్మిల.

Share this post

scroll to top