కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలలు కనడం మానండి..

mahesh-goud-07.jpg

పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ది అమిత్ షాకు చెప్పులు తొడిగిన చరిత్ర 11ఏండ్లు తెలంగాణకు ఏమి తెచ్చారో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయండి చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మోడీ, అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పని చేస్తారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20వేల ఎకరాల ప్రభుత్వ భూములు కరిగి పోతే కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు.

10వేల భూములను కేసీఆర్, కేటిఆర్ లు అమ్ముకుంటే కిషన్ రెడ్డి ఏమి చేస్తుండు. కిషన్ రెడ్డి ఒక్క చాన్స్ కావాలని ప్రాధేయపడుతుండు. తెలంగాణకు ఏమి ఎలగబెట్టారని ఒక్క చాన్స్ అని అడుగుతున్నారు. మూడు సార్లు మోడీని ప్రధానిని చేస్తే రాష్ట్రానికి ఏమి ఎలగబెట్టారు. తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డికి ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే ఏమి చేశారు. మూడో సారి కూడా మతం పేరున ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చారు. మెట్రో కోసం ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదు.

Share this post

scroll to top