పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందని మండిపడ్డారు. ఖూనీలు చేసే వారిని, దొంగ తనాలు చేసే వారిని కొట్టడమే తప్పు అని చెప్పే ఈ ప్రజాస్వామ్యం లో రాజకీయ కక్ష్య తో పోలీసులు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 2015 లో పెట్టిన పోస్టులకు ఇప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ లో ఉండే జగన్ అభిమానిని వేధించారన్నారు. బడ్జెట్ లో ప్రజలకు ఏం ఒరగ పెట్టలేదు సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించలేదని చురకలు అంటించారు. నాలుగు నెలల్లో వేల కోట్లు అప్పులు చేశారని ఆగ్రహించారు. టిడిపి నేతలు చేసే పాపలు డీజీపీ కి యజ్ఞాలలా కనిపిస్తున్నాయన్నారు. పోలీసులకు అంత ఇష్టం ఉంటే రాజకీయాల్లోకి రావచ్చని సెటైర్లు పేల్చారు పేర్ని నాని.
ఏపీ పోలీసులు ఇలానే చేస్తే ఉరి వేస్తారు..
