సీఎం చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గం పర్యటనపై విమర్శలు, ఆరోపణలు కొనసాగుతోన్న వేళ జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. అధికారంలోకి రావటానికి అప్పట్లో ఏమేమి ఎర వేశారో అందరికీ తెలుసు కానీ, ఎన్టీఆర్ లా అభిమన్యుడు కాదు జగన్ అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారని వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్న సమయంలో డ్రామాలు ఆడింది చంద్రబాబు జైల్లోకి వెళ్లగానే డీ హైడ్రేషన్ అలర్జీ అన్నారు. అప్పటి దాకా నా ఆరోగ్యం సూపర్ అన్న చంద్రబాబు ఆ తర్వాత డ్రామాలు ఆడారు. మీరు ఆడేవాటిని డ్రామాలు అంటారు. దోమలు పంపి జైల్లో కుట్టిచ్చి చంపిస్తారని మాట్లాడారు. రాజకీయాల్లో డ్రామాలు ఆడాలన్నా నాటకాలు ఆడాలన్నా చంద్రబాబుకే సాధ్యం అంటూ ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్‌లా అభిమన్యుడు కాదు అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారు..
