ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటివరకు టీడీపీ కార్యకర్తల నుంచే వినిపించగా ఇప్పుడు సెకండ్ గ్రేడ్ కేడర్ కూడా ఈ డిమాండ్ ను వినిపిస్తుంది. తాజాగా మాజీ మంత్రి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ కూడా నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అడిగారు.
నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయని, దీన్ని సోషల్ మీడియా, మీఇయా ఛానళ్లు వక్రీకరించడం సరికాదని హితవుపలికారు. నారా లోకేశ్ కష్టాన్ని గుర్తించాలని కేడర్ కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఓడిపోయి, భవిష్యత్తు ఏంటో కూడా తెలియని జగన్నే సీఎం సీఎం అని అంటున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ను కూడా జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారు. అలాంటిది తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేశ్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని నిలదీశారు.