అన్న క్యాంటీన్లలో ప్లేట్లను ఇంత దారుణంగా కడుగుతారా..

anna-cantan-27-1.jpg

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లపై సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. తణుకు అన్న క్యాంటీన్‌లో జరిగినట్లు వీడియోలోని వ్యక్తి చెప్తున్నారు. అన్న క్యాంటీన్‌లో మురికి నీటిలో ప్లేట్లు శుభ్రం చేస్తున్నారని వాటిలోనే వడ్డిస్తున్నారంటూ అందులో చెప్తున్నారు. భోజనం చేయాల్సిన ప్లేట్లను అపరిశుభ్రంగా ఉన్న నీటిలో ఉంచి తిరిగి అందులోనే భోజనం వడ్డిస్తున్నారని అడిగితే ఏవో మాటలు అంటున్నారని అందులోని వ్యక్తి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వైసీపీ శ్రేణులు కూడా వీడియోను షేర్ చేస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

పేదవాడు భోజనం చేయాల్సిన ప్లేట్లను అపరిశుభ్రంగా ఉన్న నీటిలోనే కడుగుతుండటం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీనిపై వీడియో తీసిన వ్యక్తి అన్న క్యాంటీన్‌లో పనిచేసే వ్యక్తిని నిలదీసినప్పటికీ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంలో అందులో కనిపించింది. తణుకులోని అన్న క్యాంటీన్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top