విశాఖకు ప్రధాని నరేంద్రమోదీ..

modi-08.jpg

మరికొద్ది గంటల్లో ప్రధాని నరేంద్రమోదీ విశాఖకు రాబోతున్నారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్నారు. అక్కడ నుంచి కాన్వెంట్ జంక్షన్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా సిరిపురం దత్త ఐలాండ్ కూడలికి వస్తారు. ముందుగా వెంకటాద్రి వంటిల్లు నుంచి సభా ప్రాంగణం వరకు 800 మీటర్ల మేర రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4గంటల 45నిమిషాల నుంచి ఐదున్నర వరకు జరిగే రోడ్ షోకు మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ హాజరుకానున్నారు. ఆ తర్వాత ప్రధాని కాన్వాయ్‌లోనే సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. అదే వేదిక నుంచి వర్చువల్‌గా 2లక్షల కోట్లకు పైగా విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Share this post

scroll to top