తెలంగాణ రాజకీయాలు యమారంజుగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. మొన్నటిదాకా అసెంబ్లీ సమావేశాల్లో రచ్చ నడిస్త లేటెస్ట్‌గా కేబినెట్ సబ్ కమిటీలపై పొలిటికల్ ఫైట్ పీక్స్‌కి చేరింది. అసలెందుకీ కేబినెట్ సబ్ కమిటీలు దేనికి ఉపయోగం ఎవరికి లాభం అంటూ నిప్పులు కక్కుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రతీ దానికి సబ్ కమిటీయేనా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవి సబ్ కమిటీలు కాదు. కాలక్షేపం కోసం అధికార కాంగ్రెస్ చెబుతున్న కహానీలు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క సబ్ కమిటీ కూడా సమస్య పరిష్కారం కోసం పనిచేయలేదంటూ ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు.
కేబినెట్ సబ్ కమిటీలపై రాజకీయ రగడ..
