హైదరాబాద్ వాసుల టెన్షన్ పై పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన..

ponnam-07.jpg

పాక్ తో యుద్ధం హైదరాబాద్ వాసుల టెన్షన్ పై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సా. 4 గంటలకు సికింద్రా బాద్ కంటోన్మెంట్, కంచన్ బాగ్, నానాల్ నగర్ లో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఉంటుందని చెప్పారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. అంత ర్గత భద్రత అంశం లో కేంద్రం కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ తీర్మానం చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా అటూ పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Share this post

scroll to top