సందీప్ వంగా కోసం ప్రభాస్ మారతాడా..

prabas-18.jpg

స్పిరిట్ స్టోరీని కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి వంగా డైలాగ్ వెర్షన్ ​ను పెండింగ్ ​లో పెట్టాడని వినిపిస్తోంది. డైలాగ్స్ విషయంలో తన స్టైల్ రైటింగ్ ​కు తగ్గట్లు ప్రభాస్ తనను తాను మార్చుకుంటాడా? అనే విషయం డైరెక్టర్​ ను ఆలోచనల్లో పడేసిందట. తనకు తగ్గట్లు డార్లింగ్ మారతాడా? లేదా ఆయనకు సూట్ అయ్యేలా పొడి పొడి డైలాగ్స్​తో తాను రైటింగ్ ​ను మార్చుకోవాలా? అనే ఉన్నాడట సందీప్ వంగా. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్ ​లో యాక్ట్ చేస్తూ ఆడియెన్స్​ తో పాటు మూవీ లవర్స్​ మనసుల్ని దోచుకుంటున్న ప్రభాస్ మొదట్నుంచి ఒక విషయంలో మాత్రం పెద్ద మార్పులు చేయలేదు. అదే డైలాగ్స్. పొడి పొడి డైలాగ్స్ చెబుతూ, తన కటౌట్ ఎక్కువగా మాట్లాడటం ప్రభాస్ స్టైల్. అలాగని డైలాగ్స్ విషయంలో ఏనాడూ తగ్గలేదు. ఆయన కెరీర్​లో ఎన్నో హిట్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే వాటిల్లో షార్ట్ అండ్ స్వీట్ ​వే ఎక్కువ. బాహుబలి సిరీస్ ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి.

సందీప్ రెడ్డి మూవీస్​లో లెంగ్తీ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిల్లో హీరోలు హైఫై భాషతో, మెడికల్ టెర్మినాలజీ వాడుతూ అనర్గళంగా మాట్లాడటం తెలిసిందే. డైలాగ్స్ చెప్పే టైమ్​లో యాటిట్యూడ్ కూడా స్పెషల్ అట్రాక్షన్​గా నిలుస్తూ ఉంటుంది. ప్రభాస్ సినిమాల్లో ఈ తరహా డైలాగ్స్ అంటే ‘బుచ్చిగాడు’, ఏక్ నిరంజన్ చూడొచ్చు. కానీ సందీప్ వంగా మూవీస్​లో హీరోలు మరింత ఫోర్స్, ఎనర్జీతో డైలాగ్స్ చెబుతూ ఉంటారు. 

Share this post

scroll to top