దాదాపు ఫీమేల్ ఆర్టిస్ట్ లు అయితే తమ లోని నటిని ప్రూవ్ చేసుకోడానికి అన్నట్టుగా ఇండస్ట్రీస్ లోకి వస్తారు కానీ చాలా తక్కువ మందే తమ గ్లామర్ షోతో అలరించడానికి వస్తున్నామని బోల్డ్ రోల్స్ అయినా చేయడానికి సిద్ధమే అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ని మాత్రం ఇవ్వరు. కానీ సరిగ్గా ఇదే తరహా స్టేట్మెంట్ ని కోలీవుడ్ డస్కీ అండ్ హాట్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇచ్చి షాకిచ్చింది. గత కొన్ని రోజులు కితమే సోషల్ మీడియాలో ముచ్చటించిన ఈ హాట్ బ్యూటీ తాజాగా మరోసారి నెటిజన్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది.
ఈ ఇంటరాక్షన్ లో ఒక ప్రశ్న ఈమెకి ఎదురైంది. జెనరల్ ఏ హీరో అయినా ఏ హీరోయిన్ కి అయినా ఒక డ్రీం రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా మాళవిక కెరీర్ పరంగా ఎలాంటి రోల్స్ అంటే ఇష్టం ఎలాంటివి చేయడానికి ఇష్టపడతారు అనే కామెంట్ కి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను బోల్డ్ పాత్రలు చేయడానికి సిద్ధమే అందులో సందేహం లేదు. ఎలాంటి రోల్స్ అయినా చేసి ఒక సూపర్ స్టార్ స్థాయికి ఎదగాలి అనేది నా థ్యేయం అన్నట్టుగా రిప్లై ఇచ్చింది. దీనితో ఓపెన్ గానే తనకి బోల్డ్ సినిమాలు ఆఫర్స్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఫిలిం మేకర్స్ కి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది.