పాలిటిక్స్‌లో పవన్‌ కల్యాణ్‌ ఫుట్‌బాల్‌ లాంటివారు..

pavan-07.jpg

తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కు మధ్య సోషల్‌ మీడియా వేదికగా మొదలైన వార్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పు పడుతూ వరుస ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్‌పై ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్‌లో పవన్‌ ఫుట్‌బాల్‌ లాంటివారని అన్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాలిటిక్స్‌లో పవన్‌ కల్యాణ్‌ ఫుట్‌బాల్‌ లాంటివారు. ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారు. పవన్‌ చెబుతున్నట్లు సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవు. కేవలం బీజేపీ మాత్రమే ఇబ్బందుల్లో ఉంది’ అని అన్నారు. పవన్‌ కల్యాణ్‌ నటుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్రలు పోషిస్తారన్నారు. పాలిటిక్స్‌ అలా కాదని, ఓ స్థిరమైన ఆలోచన ఉంటే బాగుంటుందని హితవు పలికారు.

Share this post

scroll to top