ఇసుక అక్రమ దందాను నియంత్రించడంలో విఫలమైన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. మల్టీ జోన్ – 2 పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో బాధ్యులను గుర్తించి వారిపై వేటు వేశారు. ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను వేకెన్సీ రిజర్వ్ కు పంపించారు. ఈ మేరకు జోన్ ఐజీపీ వి సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర నిఘా వర్గాల నివేదికలు, విచారణల అధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఐజీ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. వేటు పడిన వారిలో సంగారెడ్డి రూరల్, తాండూరు రూరల్, తాండూరు టౌన్ ఇన్స్‌పెక్టర్‌లతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పునూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్ఐలు ఉన్నారు.