సరికొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్న పీవీ సింధు..

pv-sindhu-3.jpg

పీవీ సింధు తన జీవితంలో అందమైన సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతోంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత బ్యాడ్మింటన్ స్టార్ సింధు త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. డిసెంబర్ 2 సోమవారం రోజున సింధు తండ్రి తన కుమార్తె వివాహం గురించి ఆమె అభిమానులతో మీడియాతో శుభవార్త పంచుకున్నారు. పీవీ సింధు భారత దేశ క్రీడా రంగంలో వెలుగొందుతున్న ప్రముఖ క్రీడాకారిణి. బాడ్మింటన్‌లో ఆమె విజయాలు భారతదేశాన్ని గర్వపడేలా చేశాయి. కూతురు పెళ్లి గురించి 2024 డిసెంబర్ 2న సింధు తండ్రి అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ‘లేక్ సిటీ’ ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుకను జరిపించనున్నామని సింధు తండ్రి పివి రామన్న తెలిపారు. సింధు పెళ్లి వార్త ఆమె అభిమానులను ఆనందపరిచింది. పీవీ సింధు తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువతి. ఆమె నిఖిల్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకోనున్నారు. నిఖిల్ ఒక ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

Share this post

scroll to top