తల్లీ అనిత నిన్ను పవన్ కల్యాణ్ పొగిడాడా తిట్టాడా అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆగ్రహించారు. హోం శాఖ పదవిపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాజమల్లు. హోం శాఖ నేను తీసుకుంటాను అంటుంటే అర్ధం మీరు పూర్తిగా విఫలం అయ్యారనే అర్థం అంటూ సెటైర్లు పేల్చారు. ఆయన స్పష్టంగా చెప్తున్నారు కానీ మీరే మిమ్మల్ని సమర్ధించుకుంటున్నారని వివరించారు. డిప్యూటీ సీఎం మాట్లాడిన మాటలను ముఖ్యమంత్రి కూడా బాద్యత వహించాలని డిమాండ్ చేశారు. మా ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వానికి పాలించే అర్హతే లేదన్నారు.
తల్లీ అనిత నిన్ను పవన్ కల్యాణ్ పొగిడాడా..
