నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..

havey-rain-18.jpg

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది, ఆంధ్రప్రదేశ్‌కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుంటుందని ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురు గాలులతో పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలకు ఛాన్స్ వుంది. ఇక, గడచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా డెంకాడలో 2 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. తీవ్ర అల్పపీడనంపై విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్‌ పూర్తి వివరాలను వెల్లడించారు. ఇక, పంటలు కోసే సమయం కావడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Share this post

scroll to top