ఆంధ్రప్రదేశ్ కూటమి నేతల్లో రాజ్యసభ రేస్ మొదలైంది. ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. దాంతో, కూటమి పార్టీల మధ్య వేడి రాజుకుంది. మరి, మూడు సీట్లను సమానంగా ముగ్గురూ పంచుకుంటారా? లేక లెక్కల ప్రకారం ముందుకెళ్తారా?. అసలు, రాజ్యసభ రేస్‌లో ఎవరున్నారు? ఏ పార్టీ నుంచి ఎవరు సీటు ఆశిస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో రాజ్యసభ రేస్ ఉత్కంఠ రేపుతోంది. రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీపడుతున్నారు కూటమి నేతలు.. అయితే, మూడు స్థానాల్లో ఒకటి టీడీపీకి దాదాపు ఖరారైనట్టు చెబుతున్నారు. మిగతా రెండు సీట్లలో ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని మూడో స్థానం కోసం టీడీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉందని అంటున్నారు. ఇక టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్, కంభంపాటి రామ్మోహన్‌రావు, గల్లా జయదేవ్ పోటీపడుతున్నట్టు సమాచారం అలాగే, జనసేన నుంచి నాగబాబు బీజేపీ నుంచి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి రేస్‌లో ఉన్నట్టు చెబుతున్నారు.