తాజాగా నెపోటిజంపై రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమలో నెపోటిజం వలన తాను కొన్ని అవకాశాలను కోల్పోయానని హీరోయిన్ రకుల్ ప్రీత్ వెల్లడించారు. కానీ, ఆ విషయంలో తానెప్పుడూ బాధపడలేదని పేర్కొన్నారు.స్టార్ కిడ్స్‌కు సినిమాల్లో అవకాశాలు వెంటనే దొరుకుతాయని, అందుకు వారి తల్లిదండ్రుల కష్టమే కారణమని చెప్పారు రకుల్. అవసరం అయితే తాను కూడా భవిష్యత్‌లో తన పిల్లల కోసం కష్టపడతానని, వారికి ఒక మంచి ఫ్లాట్ ఫామ్ ఇస్తానని చెప్పుకొచ్చారు. లైన్‌లో నిలబడి మీ లక్‌ను పరీక్షించుకోండి అని చెప్పను అంటూ ఓ ఇంటర్వ్యూలొ రకుల్ తన మనసులోని మాటను బయటపెట్టారు.
నెపోటిజం వలన చాలా అవకాశాలు కోల్పోయా ..
