మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఆచార్య వంటి భారీ ఫ్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ఈ చిత్ర షూటింగ్ శంకర్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. భారతీయుడు -2 రిలీజ్ కోసం గేమ్ ఛేంజర్ ను పక్కన పెట్టాడు శంకర్. తాజగా ఈ చిత్ర షూటింగ్ ను మల్లి స్టార్ట్ చేసాడు శంకర్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
కాగా ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ అందుతోంది, దసరా కు గేమ్ ఛేంజర్ టీఙర్ ఇవ్వాలనే ప్రయత్నాలు ఙరుగుతున్నాయని తెలుస్తోంది. అలాగే ఈ రోజు విడుదల కనున్న రా మచ్చా..రా..పాటలో దేశంలోని అన్ని కళారూపాలు చూపిస్తూ, నిమిషంన్నర పాటు ఓన్లీ మ్యూఙిక్ బిట్ చాలా బాగుందట. ఈ చిత్రంలో న్యూఙిలాండ్ లో చిత్రీకరించిన మెలోడీ సాంగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందట. అడ్డంకులు అన్నీ తొలగిపోయిన ఈ చిత్రాన్ని మొదట రిలీజ్ డేట్ డిసెంబరు 20న రిలీజ్ చేయాలి అని భావించిన మేకర్స్ తాజగా ఈ చిత్రాన్ని డిసెంబరు 25న రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారక ప్రకటన రానుంది.