సినిమాల్లోకి అలేఖ్య చిట్టి పికిల్స్ బ్యూటీ..

ramya-16.jpg

హైదరాబాద్‌లోని AAA థియేటర్లో ‘వచ్చినవాడు గౌతమ్’ సినిమా టీజర్ జరిగింది. ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో ఓవైపు హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ రియా సుమన్ లు ఆకట్టుకోగా, మరోవైపు రమ్య మోక్ష కంచర్ల హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోషల్ మీడియాలో ఇప్పటికే చిట్టి పికిల్స్ ద్వారా పరిచమైన రమ్య ఈ వేడుకలో మెరిసి ఫాలోవర్ల దృష్టిని ఆకర్షించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన కంచర్ల సిస్టర్స్ ముగ్గురిలో చిన్నదైన రమ్య మోక్ష సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 గతంలో ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ తాను ఇప్పటికే రెండు సినిమాల్లో నటించాను. అందులోనూ మేకప్ లేకుండానే నటించాను అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల మధ్య ‘వచ్చినవాడు గౌతమ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ఆమె హాజరయ్యారు. ఆ వేదికపై ఆమె పాల్గొనడం, మీడియాలో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, రమ్య మోక్ష ఈ సినిమాలో ఏమైనా పాత్రలో కనిపించనున్నారా? అనే విషయం మాత్రం ఇంకా అధికారికంగా తెలియలేదు. కానీ, అందిన సమాచారం మేరకు రమ్య ఈ సినిమాలో నటించినట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top