లైంగికంగా వేధించాదంటూ జానీ మాస్టర్ పై కేసు..

jani-15-.jpg

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అత్యాచారం కేసు నమోదయింది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ జూనియర్ డ్యాన్సర్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అత్యాచారంతో పాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. ఫిర్యాదు చేసిన యువతి వయసు 21 సంవత్సరాలు అని తెలిసింది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని అక్కడికి బదిలీ చేసినట్టు సమాచారం. ఔట్ డోర్ షూటింగులలో తనపై అత్యాచారం చేశాడని యువతి పేర్కొంది. జీరో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కి కేసును ట్రాన్స్‌ఫర్ చేశారు.

Share this post

scroll to top