కోపం వచ్చినప్పుడు శరీరంలో ఆడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ హార్మోన్లు రక్తపోటు, హృదయస్పందన రేటును పెంచుతుంది. ఇది గుండెపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. నిరంతరం కోపం కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. గుండె సిరల్లో వాపు, గుండెపోటు ఇతర జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం కోపం మానసిక ప్రభావాన్ని మాత్రమే కాకుండా శారీరిక ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు రక్తపోటు, హృదయస్పందన రేటు పెరుగుతుంది. ఇది రక్తం గడ్డకట్టే అవకాశాలను కూడా పెంచుతుంది. అంతేకాకుండా నిరంతరం కోపం గుండె కండరాలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది. మీకు తరచుగా కోపం వస్తుంటే మీ మానసిక స్థితిపై శ్రద్ధ వహించాలని నిపుణులు అంటున్నారు.
కోపాన్ని నియంత్రించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం వంటి చర్యలను అవలంబించాలి. మానసిక ప్రశాంతతను పొందడానికి యోగా, ధ్యానం అత్యంత ప్రభావవంతమైన మార్గాలు. ఇది శరీరం, మనస్సు రెండిటిని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతి పరిస్థితిని సానుకూలంగా చూడటం, కోపాన్ని సానుకూలంగా వ్యక్తపరచడం, హృదయానికి, శరీరానికి రెండిటికి ప్రయోజనకరం గా ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు వంటి సంతోషకరమైన హార్మోన్లు ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఒత్తిడి, కోపాన్ని తగ్గిస్తుంది. అయితే మీ కోపం విపరీతంగా రావడం, తరచు ఉగ్రపోవడం వంటి పరిస్థితులు ఉంటే వెంటనే అలాంటి వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకు వెళ్లడం మంచిది.