విడదల రజినికి హైకోర్టులో ఊరట..

rajani-26.jpg

మాజీ మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. ఎడ్లపాడు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారని విడుదల రజిని, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ పై ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ముగ్గురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు విచారించింది. ఇందులో భాగంగా విడదల రజనీతో పాటు పిఏ రామకృష్ణకు 41A నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా విచారణకి సహకరించాలని విడదల రజినీకి, పిఏ రామకృష్ణకి ఆదేశాలు జారీచేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని న్యాస్థానం ఆదేశించింది. విడదల రజిని మరిది గోపిని ఇప్పటికే అరెస్టు చేసామని ఏసీబీ కోర్టుకు తెలపడంతో గోపి పిటిషన్ డిస్పోజ్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.

Share this post

scroll to top