జర్నలిస్ట్ పై దాడి కేసులో హీరో మోహన్‌బాబుకు సుప్రీంకోర్టు(సుప్రీంకోర్టు)లో ఊరట లభించింది. గతంలో ఇదే కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా మోహన్‌బాబు ముందస్తు బెయిల్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారించగా ఆయన తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అనంతరం సుప్రీం కోర్టు మోహన్ బాబుకు ఊరటనిచ్చే తీర్పు ఇచ్చింది.
తదుపరి విచారణ వరకు మోహన్‌బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అలాగే ముందస్తు బెయిల్ విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటుగా మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గత నెలలో మంచు ఫ్యామిలి లో నెలకొన్న వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు ఇంటివద్ద రిపోర్టింగ్ కు వెళ్లిన జర్నలిస్ట్ రంజీత్‌పై మైక్ తో దాడి చేశాడు. దీంతో పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.