రెండు తెలుగు రాష్ట్రాల విభజన పూర్తి అయి పదేళ్లు అవుతున్న తెలంగాణ ఉద్యోగులు ఇంకా ఏపీలోనే పని చేయాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగులు తాజాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజెంట్ ఏపీలో 712 మంది తెలంగాణకు చెందిన ఉద్యోగులు ఉన్నారని సమాచారం. అలాగే సచివాలయం, వివిధ హోచ్‌వోడీల కార్యాలయాలు, 9, 10 వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులు తమ సీనియార్టీ కోల్పోయిన ఫర్వాలేదని ..తమను తమ రాష్ట్రానికి పంపాలని ప్రాధేయ పడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా..తమను స్వరాష్ట్రానికి పంపకపోవడం పై తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో తమ విజ్ఞప్తులను పరిష్కారించాలని రెండు రాష్ట్రాల సీఎంలను (ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి) తెలంగాణ ఉద్యోగులు అభ్యర్థిస్తున్నారు.
ఏపీ నుంచి రిలీవ్ చేయండి..తెలంగాణ ఉద్యోగుల వినతి..
