దెబ్బతిన్న రైల్వే ట్రాక్స్‌..

railway-2.jpg

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ మహబూబాబాద్ రూట్ లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. మూడు చోట్ల సుమారు వెయ్యి మంది సిబ్బందితో ట్రాక్ మరమ్మతు పనులను చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ష బీభత్సానికి రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. రైల్వే ట్రాక్లు పలుచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. జోన్ పరిధిలో 101 రైళ్లు పూర్తిగా, మరో 8 పాక్షికంగా రద్దయ్యాయి. 68 రైళ్లను దారి మళ్లించారు.

ట్రాక్పైకి వరద నీరు చేరడంతో కాజీపేట-విజయవాడ మార్గంలో అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దారి మళ్లించిన రైళ్లు 5-10 గంటల ఆలస్యంగా గమ్యస్థానం చేరుకున్నాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ద.మ. రైల్వే సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో ‘ఎమర్జెన్సీ కంట్రోల్ రూం’ను ఏర్పాటు చేసింది. మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ వరదనీటికి తీవ్రంగా దెబ్బతింది. కింద ఉండే కంకర కొట్టుకుపోవడంతో ట్రాక్ వేలాడింది. తాళ్లపూసపల్లి- మహబూబాబాద్ స్టేషన్ల మధ్య వరదనీరు రైల్వేట్రాక్ని కోతకు గురైంది. కేసముద్రం-ఇంటికన్నె స్టేషన్ల మధ్య కంకర కొట్టుకుపోవడంతో రైలు పట్టాలు వేలాడాయి.

Share this post

scroll to top