టాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపారు. అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటివరకు టాలీవుడ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయని సీఎం. డ్రగ్స్ నియంత్రణలో సహకరించాలని సినీ పరిశ్రమను కోరారు. ఈ సందర్భంలోనే తనదైన మాట తీరుతో ఇండస్ట్రీ పెద్దలకు చురకలు అంటించారు సీఎం. ఎన్నడూ లేనట్లు సీఎం వ్యాఖ్యలు చేయడమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అసలు టాలీవుడ్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలు వెనుక కారణమేంటి? ఈ ఏడాది జనవరిలో ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమను కోరారు. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరం’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
టాలీవుడ్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలు వెనుక కారణమేంటి..
