డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా దళిత ఎంపీ పైన దాడులు చేయించడం దారుణం అంటూ నిప్పులు చెరిగారు రోజా. మా వైసిపి కార్పొరేటర్లు కిడ్నాప్ చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మీ ఎమ్మెల్యే తిరుపతిలో దిగజారి ఇవన్నీ చేస్తున్నాడు మీకు కనపడలేదా అంటూ నిలదీశారు. మీరు నిజంగా ప్రజా మద్దతుతో గెలిచి ఉంటే ఇలా చేయాల్సిన అవసరం ఎముందని నిలదీశారు రోజా. తిరుపతిలో టీడీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారని బస్సుపై దాడి చేసి కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనను సాగిస్తున్నార్నారు. మున్సిపల్, కార్పోరేషన్లలో బలం లేకపోయినా పదవులను టీడీపీ కైవసం చేసుకోవటం దారుణం అని చురకలు అంటించారు.
వైసీపీ మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్..
