జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు..

telangana-22.jpg

700 కోట్లతో అల్యూమినియం టిన్నులను ఉత్పత్తిచేసే బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌ సంస్థ తెలంగాణలో తమ ఫ్లాంట్ పెట్టేందుకు రెడీ అయింది. బీర్లు, కూల్‌డ్రింక్స్, పర్‌ఫ్యూముల ఇండస్ట్రీకి ఈ సంస్థ అల్యూమినియం టిన్నులను సరఫరా చేయనుంది. 500 మి.లీ. పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్‌ చేయడం వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందన్నారు. కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. ఆ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. మంత్రితో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు తమ సంస్థ విస్తరణ ప్రణాళికను ఆయనకు వివరించారు. ఈ సంస్థను నెలకొల్పటం ద్వారా దాదాపు 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులతో తాను చర్చిస్తానని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.

Share this post

scroll to top