భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో మతపరమైన సమస్యలను సృష్టించాలనే లక్ష్యంతో సైబర్ దాడులకు దిగుతుంది దాయాది దేశం. తాజాగా, ఎక్స్ వేదికగా చేసిన ఒక పోస్ట్ తీవ్ర కలకలం రేపుతుంది. అయితే, కర్ణాటకలోని బెళగావిలో ఉన్న కల్నల్ సోఫియా ఖురేషి ఇంటిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మద్దతుదారులు ధ్వంసం చేశారని అందులో పేర్కొంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో రంగంలోకి దిగిన కర్ణాటక పోలీసులు ఆ పోస్ట్ చేసిన ఎక్స్ ప్రొఫైల్ పేరు అనిస్ ఉద్దీన్ అని ఉంది. ఆ లొకేషన్ బ్రిటిష్ కొలంబియా, కెనడా అని చూపిస్తుంది. ఈ ప్రొఫైల్ 405 హ్యాండిల్స్, 31 మంది ఫాలోవర్లను కలిగి ఉందన్నారు. ఇందులో చాలా పోస్ట్‌లు పాకిస్తాన్‌కు మద్దతుగా ఉన్నాయని గుర్తించారు. కవర్ ఇమేజ్‌లో పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ ముహమ్మద్ అలీ జిన్నా, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఇతర ఉన్నత పాకిస్తాన్ రక్షణ అధికారుల ఫోటోలు దర్శనమిచ్చాయి.
భారత్ లో మతపరమైన ఆటంకాలు సృష్టించాలని పాక్ ప్రయత్నం..
