నటి శ్రియా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు ఇండస్ట్రీలో ‘అప్పుడప్పుడు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తర్వాత శర్వానంద్ ‘అమ్మచెప్పింది’మూవీలో పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. ఇక తన మరిది విశాల్ పోగరు మూవీలో నెగిటివ్ క్యారెక్టర్‌లో ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఆమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించినది. ఈ చిత్రం తర్వాత 2008లో విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకున్న శ్రియా ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత సలార్‌తో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవర్ఫుల్ పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తుంటుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీయారెడ్డి ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో వైట్ షర్ట్ ధరించి బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని ఫోటోలకి ఫోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు వైట్ షర్ట్‌లో హాట్ లుక్స్‌తో హీట్ పుట్టిస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వెకేషన్ మూడ్‌లో ‘సలార్’ బ్యూటీ శ్రీయా రెడ్డి.. వైట్ షర్ట్‌లో హీట్ పుట్టిస్తున్నావంటూ కామెంట్స్
