తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్..

telangana-10-3.jpg

తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయన ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ డీజీగా ఆదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. 1992వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన జితేందర్ పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు. కాగా తెలంగాణలోని నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా తొలుత విధులు నిర్వర్తించారు. కాగా 2025 సెప్టెంబరులో జితేందర్ పదవీవిరమణ చేయనున్నారు. దీంతో తెలంగాణ డీజీపీగా 14 నెలలపాటు కొనసాగే అవకాశం ఆయనకు ఉంది.

Share this post

scroll to top