రాయలసీమ జిల్లాల్లో హింస కొత్త పుంతలు తొక్కుతోంది. మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తున్నారు. మొన్న ఆళ్లగడ్డలో శ్రీదేవి దారుణహత్యకు గురైతే.. నేడు ఆదోనిలో గుండమ్మ ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. పొలం తగాదా విషయంలో గుండమ్మ అనే మహిళ హత్య. అడ్డు వచ్చిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గుండమ్మ అనే మహిళపై ట్రాక్టర్‌తో దాడి చేశారు. గుండమ్మ తరపున మద్దుతు వచ్చిన పురుషోత్తమ రెడ్డిపై కూడా దాడికి పాల్పడి పారిపోయారని హత్యకు గురైన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో గుండమ్మ అక్కడిక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పురుషోత్తం రెడ్డి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు ఆదోని ఆసుపత్రి సిబ్బది. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూల్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. హత్య గురించి తెలిసిన వెంటనే స్పందించిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఇలాంటి ఘాతుకాలకు పాల్పడిన వారు ఎవరైనా వదిలిపెట్టేదే లేదన్నారు.
రతనాల సీమలో రక్తపాతం.. మహిళలే లక్ష్యంగా దారుణాలు.. హత్యకు కారణాలివే..
