జాక్’ సినిమాకు గాను సిద్దు జొన్నలగడ్డ ఎనిమిది కోట్ల రూపాయల పారితోషికం అందుకోగా, తాజా సమాచారం ప్రకారం తన పారితోషికం నుంచి సగం, అంటే 4 కోట్ల రూపాయలు నిర్మాతకు తిరిగి ఇచ్చి, తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఈ చర్య సినీ పరిశ్రమలో అరుదైన, ఆదర్శనీయమైన ఉదాహరణగా నిలిచింది. సిద్దు ఈ విధమైన బాధ్యతాయుతమైన, నీతిగల నిర్ణయంపై నెటిజన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు అందరూ ఆశ్చర్యపోయి, అతని మంచితనాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో సిద్దు గురించి ప్రశంసలు కురుస్తున్నాయి. ‘సిద్దు లాంటి నటులు నిర్మాతలకు అండగా నిలిస్తే, సినీ పరిశ్రమ మరింత విజయవంతమవుతుంది’ అని అభిమానులు, విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చర్య సిద్దు జొన్నలగడ్డను కేవలం ఒక నటుడిగా కాక, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, సినీ పరిశ్రమకు ఆదర్శంగా నిలిపింది.
గొప్ప మనసు చాటుకున్న సిద్దు జొన్నలగడ్డ..
