ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పనకు సంబంధించి హెల్త్ అప్‌డేట్‌ను నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రాణ హాని లేదని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు కల్పనను ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే స్టమక్ వాష్ చేయించినట్లు చెప్పారు. ప్రస్తుతం కల్పన హైదరాబాద్‌లో ఉంటుంది. ఆమె పెద్ద కుమార్తె కేరళలో ఉంటుంది. అయితే కల్పన ఫోన్ చేసి హైదరాబాద్‌కు రావాలని కోరింది. అందుకు పెద్ద కుమార్తె హైదరాబాద్ వచ్చేందుకు నిరాకరించింది.
తాను కేరళలోనే ఉంటానని చెప్పడంతో ఇద్దరి మధ్య ఫోన్‌లో వాగ్యుద్ధం నడిచినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోజు వేసుకునే టాబ్లెట్స్ కంటే అధికంగా వేసుకుందని పోలీసులు తెలిపారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేశారని కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నారు. అపార్ట్‌మెంట్ విల్లా సెక్రటరీకి ప్రసాద్ ఫోన్ చేసినట్లు తెలిపారు. అపార్ట్‌మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కల్పన ఆరోగ్యం కుదిటపడిందని ఈరోజు ఆమె నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తామని చెప్పారు.