గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు పై పొగ చిన్న మొదలై క్రమంగా పెద్దదైంది. భూమి పొరల నుంచి పొగలు రావడం చూసి వాహనదారులు, ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఓ వైపు వర్షాలు పడుతున్నాయి.. ఇలాంటి సమయంలో భూమి లో నుంచి ఆ విధంగా పొగలు రావడం అయోమయానికి గురి చేసింది.
భూమిలో నుంచి ఒక్కసారే పొగలు రావడంతో ఎమైతుందో అన్న భయంతో వాహనదారులు, స్థానికులు భయంతో వణికిపోయారు. ఈ వింత సంఘటన ఏంటా చూడటానికి జనాలు ఎగబడటంతో కొంతసమయం వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఇటీవల అందే ప్రాంతంలో అండర్ గ్రౌండ్ లో విద్యుత్ శాఖ సిబ్బంది 11 కేవీ కేబుల్ ను అమర్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి పొగలు రావొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్ని విషయం తెలుసుకునేందుకు అధికారులు రంగంలో దిగారు.