రాష్ట్రంలో కక్షపూరితంగా పార్టీ ఆఫీసులు కూల్చడానికా కూటమికి అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్. అలాగే, టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి పర్మిషన్ ఉందా?. ఏపీలో టీడీపీ పార్టీ కార్యాలయాలకు పర్మిషన్ ఉంటే చూపించండి అని ప్రశ్నించారు. కాగా, శ్రవణ్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏవైనా భవనాలను కూల్చాలనుకుంటే కోర్ట్ ఆర్డర్‌తో కూల్చండి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. రూల్ ఆఫ్ లాను టీడీపీ ఉల్లంఘిస్తోంది. పార్టీ ఆఫీసులకు అనుమతి లేదని అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా?. అధికారులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లు కొమ్ము కాయడం కరెక్ట్ కాదు. ఇటువంటి చర్యల వల్ల ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోతుంది.
అచ్చెన్నాయుడు స్టేట్‌మెంట్ ఎంత ప్రమాదకరమో భవిష్యత్‌లో తెలుస్తుంది..
