శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. దీంతో ఈ సంవత్సరంలో నాలుగోవ సారి రేడియల్ క్రెస్టు గేట్ ఎత్తివేశారు అధికారులు జలాశయం ఒక గేట్ 10 అడుగులు మేర ఎత్తి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,38,833 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో 96,081 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం నీటిమట్టం 884.50 అడుగులుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 212.9198 టీఎంసీలుగా ఉంది మరోవైపు. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఇన్ ఫ్లో రూపంలో ప్రాజెక్టులోకి 1,38,833 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఒక గేటు ఎత్తడం జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 96,081 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తోంది.
నాల్గోసారి శ్రీశైలం గేట్లు ఎత్తివేత..
