వచ్చే మూడు రోజులు జాగ్రత్త బయటకు అసలు రావొద్దు..

have-sun-17.jpg

ఎండలే ఎండలు భగ్గుమంటున్నాయి. బయటకు కాలు పెట్టే పరిస్థితి లేదు. ఉదయం నుంచే ఎండల తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నాం సమయానికి తీవ్రమైన వేడిగాలులు తాట తీసేస్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు అత్యంత వేగంగా పెరిగిపోతున్నాయి. తీవ్ర వేడిగాలల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణం కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

వచ్చే మూడు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగాలులు తీవ్రంగా వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. గత 24 గంటల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 40.3 డిగ్రీ సెల్సి‌యస్ నమోదు కాగా, మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 19.2 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఆదిలాబాద్‌లో సాధారణం కన్నా 3.4 డిగ్రీ సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Share this post

scroll to top